హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
- May 30, 2022
తిరుపతి: హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 6 నుండి 10 వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జూన్ 6న ఉదయం 11గంటలకు ఆలయ ప్రాకారంలో శేష వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తారు. ఉదయం 11.20 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేరోజు రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూన్ 7న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, ఉదయం 10.30 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనసేవ జరుగనుంది. జూన్ 8న ఉదయం 9 గంటలకు గజవాహనం, ఉదయం 11 గంటలకు శాంతి కల్యాణం, రాత్రి 8 గంటలకు గరుడసేవ నిర్వహిస్తారు. జూన్ 9న ఉదయం 8 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ జరుగనున్నాయి. జూన్ 10న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







