ఇండియాను ఫాలో అవుతున్న పాక్
- May 30, 2022
మన దాయాది దేశం గుడ్డిగా మనల్ని ఫాలో అవుతోంది. ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకే కేంద్రం ముడి చమురును కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఇండియాకు మేలు జరుగుతోంది.
అయితే యుద్ధ సమయంలో రష్యా నుంచి ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ కొనుగోలును నిలిపేస్తున్న సమయంలో ఇండియా కొనుగోలు చేయడం విమర్శలపాలైంది. అయినా సరే.. మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం అనుకున్న ఇండియా.. రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. తన స్టాండ్‌పై ఇండియా గట్టిగా నిలబడింది.
ఈ విదేశాంగ విధానాన్ని గతంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తెగ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ దేశం మన ఇండియాను ఫాలో అవుతోంది. దాయాది దేశం పాకిస్తాన్ కూడా భారత్ తరహాలోనే రష్యా నుంచి చమురు కొనాలని నిర్ణయించింది. పాక్‌లోని చమురు కొరతను అధిగమించేందుకు పాక్ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోబోతోంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
అంతే కాదు.. కేవలం పెట్రోల్ , డీజిల్ మాత్రమే కాదు.. కొన్ని ఆహార పదార్థాలను సైతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికర్ ఓ ప్రకటన ఇచ్చారు. పాక్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్వేచ్ఛా వాణిజ్యం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆర్థిక, వాణిజ్య బంధాల విస్తరణపై పాకిస్తాన్‌కు స్పష్టత ఉందని సదరు విదేశాంగ ప్రతినిధి అంటున్నారు. పాక్ దేశ అవసరాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయంటున్నారు.
చమురు కొరత కారణంగా పాకిస్తాన్ ఇటీవల పెట్రో ఉత్పత్తుల ధరలను బాగా పెంచేసింది. ఏకంగా లీటరుకు ఏకంగా 30 రూపాయలు పెచింది. ఈ పెంపుపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి భారత్ చవకగా చమురుని దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు పాక్ కూడా మేలుకొంది. తాను కూడా రష్యా చమురు కొనుగోలుకు సిద్ధమైంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







