బాలయ్య కోసం సోనాక్షి: అనిల్ రావిపూడి సినిమా కోసమేనా.?

- May 30, 2022 , by Maagulf
బాలయ్య కోసం సోనాక్షి: అనిల్ రావిపూడి సినిమా కోసమేనా.?

బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్ 3’ ప్రమోషన్ల టైమ్‌లోనే ఈ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న హింట్లు లీక్ చేసి, అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలు పెంచేస్తూ వచ్చేశాడు. ఇదేదో బాగుందే అనుకుంటూ, ప్రతీ ఇంటర్వ్యూలోనూ బాలయ్య సినిమా ఊసు తీసుకొచ్చి, ఎప్పటికప్పుడే అప్‌డేట్స్ రాబట్టడంలో అత్యుత్సాహం ప్రదర్శించారు సదరు మీడియా యాంకర్లు.

తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి  తాజాగా మరో న్యూ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని తీసుకొచ్చే యోచనలో బాలయ్య అండ్ టీమ్ వున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సరసన హీరోయిన్ అంటే ఖచ్చితంగా కాస్త సీనియర్ బ్యూటీ అయ్యుండాలి.

ఆ క్రమంలో లిస్టు తీస్తే, సోనాక్షి సిన్హా వైపు నుంచి పాజిటివ్ వైబ్స్ అందుతున్నాయట. ఈ మధ్య సోనాక్షి సిన్హాకి బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తోందన్నసంకేతాలు అలా అలా సోషల్ మీడియా వేదికగా తెలుగు మేకర్ల వరకూ చేరాయట.

దాంతో డైరెక్టుగా సోనాక్షినే సంప్రదిస్తే పోలా.. అనుకున్నారో ఏమో, ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయట. సోనాక్షి కూడా అందుకు సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీపై ప్రచారం జరిగింది. కానీ, కుదరలేదు. ఏమో ఇప్పుడైనా వర్కవుట్ అవుతుందేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com