కత్తితో దాడి చేసిన నైజీరియన్ వ్యక్తి...8 మందికి గాయాలు

- June 02, 2022 , by Maagulf
కత్తితో దాడి చేసిన నైజీరియన్ వ్యక్తి...8 మందికి గాయాలు

ముంబై: దక్షిణ ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ పాదచారులపై విచ్ఛలవిడిగా చెలరేగిపోయాడు.ఈ ఘటనలో 8మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పార్సీవెల్ సమీపంలోని టాటా గార్డెన్‌లో జాన్ అనే 50ఏళ్ల నైజీరియన్ వ్యక్తి మహిళతో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా లేచి దాడికి పాల్పడ్డాడు.

కత్తిని బయటకు తీసి దాడి చేయడంతో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ముంబై అడిషనల్ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ఘటనాస్థలంలో రోడ్లపై రక్తపు మరకలు రికాక్డ్ అయిన వీడియోలో కనిపించింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com