మార్షల్ ఆర్ట్స్‌లో ఆరి తేరుతున్న బుట్టబొమ్మ: ఎందుకో తెలుసా.?

- June 02, 2022 , by Maagulf
మార్షల్ ఆర్ట్స్‌లో ఆరి తేరుతున్న బుట్టబొమ్మ: ఎందుకో తెలుసా.?

బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ముద్దుగుమ్మ పూజా హెగ్దే త్వరలో యాక్షన్ గాళ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకోబోతోందట. అందుకోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట పూజా హెగ్దే. గతంలోనూ పూజా హెగ్దేకి మార్షల్ ఆర్ట్స్‌తో కాస్త టచ్ వున్న సంగతి తెలిసిందే.

అయితే, పూజా నటించబోయే ఓ సినిమా కోసం ఇప్పుడు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోందనీ తెలుస్తోంది. ఆ సినిమా ఏంటంటే, పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ‘జనగణమన’ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా ఈ మధ్యనే ఈ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ అని అంటున్నారు. అయితే, అధికారికంగా ప్రకటించలేదు. కానీ, దాదాపు పూజా హెగ్దే ఫిక్సయినట్లే అని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే, పూజా హెగ్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోందట. ‘ఆచార్య’ సినిమాతో ఓ చిన్న యాక్షన్ బిట్ కట్ చేశారు పూజా హెగ్దే, రామ్ చరణ్‌పై.

అయితే, అది జస్ట్ ఓ సాంగ్ కోసం కట్ చేసిన రొమాంటిక్ బిట్ అంతే. కానీ, ఈ సారి అలా కాదట. పూరీ సినిమా కోసం అసలు సిసలు యాక్షన్ గాళ్‌గా మారబోతోందట బుట్టబొమ్మ. ‘జనగణమన’ సినిమా పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్  అన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఇలా చాలా మంది స్టార్ హీరోలను అనుకున్నాడు.

కానీ, వాళ్లెవ్వరితోనూ కుదరలేదు. ఎట్టకేలకు విజయ్ దేవరకొండను లాక్ చేశాడు పూరీ జగన్నాధ్. విజయ్ దేవరకొండ మంచి నటుడు. పూరీ స్టైల్‌ని మ్యాచ్ చేయగల హీరో. సో, అనుకున్న విధంగానే పూరీ జగన్నాధ్ తన డ్రీమ్ ప్రాజెక్టును కంప్లీట్ చేయగలడేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com