ఏపీలో సినిమా టికెట్లపై సర్కార్ కొత్త గైడ్ లైన్స్
- June 03, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా టికెట్ల విక్రయాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిగితేనే కలెక్షన్ల వివరాలు పూర్తిగా తెలుస్తాయని.. తద్వార పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు తావుండని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వ్యవహారంపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవలే టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల కాంట్రాక్ట్ ను జస్ట్ టికెట్స్ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా టికెట్లఅమ్మకాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో టికెట్ల విక్రయం, ధరలు, ఇతర అంశాలపై క్లారిటీ ఇచ్చింది. టికెట్ల విక్రయానికి నోడల్ ఏజెన్సీగా ఏపీఎఫ్డీసీకి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్టంలో అన్ని థియేటర్లు APFDCతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లకే సినిమాలు ప్రదర్శించడం, టికెట్లు విక్రయించుకునే అవకాశముంటుంది. అలాగే అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రతి టికెట్ పై 2 శాతం సర్వీస్ చార్జీ ఉంటుందని తెలిపింది. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలకు సంబంధించిన మౌలిక సదుపాలను థియేటర్లే ఏర్పాటు చేసుకోవాలన్న ప్రభుత్వం.., ప్రతి థియేటర్ ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలను పక్కాగా చేయాలని స్పష్టం చేసింది. కొత్త సినిమాకు వారం ముందు నుంచి మాత్రమే టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం తెలిపింది.
దిలా ఉంటే ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ పోర్టల్ పై మల్టిప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వానికి మద్దతుగా ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఆన్ లైన్లో టికెట్లు విక్రయించవచ్చని.. ఈ పద్ధతిని కొన్నాళ్లు పరిశీలించి చూద్దామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో జీవో నెంబర్ 142 జారీ చేసిన సంగతి తెలిసిందే.
తొలుత ప్రభుత్వ విధానంపై కోర్టు కూడా కొన్ని సందేహలు వ్యక్తం చేసింది. ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తే మోనోపొలి అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ గత విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఐతే ప్రభుత్వం చెప్పిన కారణాలు, వివరణకు సంతృప్తి చెందిన కోర్టు.. కొన్నిరోజులు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆన్ లైన్ టికెట్ల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నుంచి అనుమతి రావడంతో ఇకపై ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా మాత్రమే సినిమా టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







