అనుష్కకి అదే ఆఖరి సినిమానా.?
- June 03, 2022
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అనుష్కాశెట్టికి ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. ‘బాహుబలి’ సినిమాకి అనుష్క ఓ మెయిన్ అట్రాక్షన్. ఆ సినిమా టైమ్‌లో అనుష్క ‘సైజ్ జీరో’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటించింది. ఆ సినిమా కోసం భారీగా బరువు పెరిగింది అనుష్క.
అప్పటి నుంచీ పెరిగిన బరువు తగ్గించుకోవడానికి అనుష్క పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎందుకో తెలీదు కానీ, ఆ బరువు బాధ్యతను తీర్చుకోలేకపోతోంది అనుష్క. పెరిగిన బరువు కారణంగా అవకాశాలు రావడం లేదు. ఇదిగో బరువు తగ్గిందట. అదిగో బరువు తగ్గిందట.. అనే ప్రచారమే కానీ, నిజంగా అనుష్క బరువు తగ్గింది లేదు.
దాంతో సినిమాల నుంచి చాలా గ్యాప్ వచ్చేసింది. మొన్నా మధ్యన ‘నిశ్శబ్ధం’ అనే సినిమాలో నటించింది. కానీ, అందులోనూ లావుగానే కనిపించింది అనుష్క. ఇక, ఇప్పుడు ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తోంది అనుష్క.
ఆ సినిమా తర్వాత అనుష్క సినిమాల్లో నటించదనీ ఇన్ సైడ్ టాక్. సినిమాలపై అనుష్కకు ఆసక్తి తగ్గిపోయిందట. పెరిగిన బరువు కారణంగా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తోందట. సో, ఇకపై అనుష్క సినిమాల్లో నటించే అవకాశం వుండకపోవచ్చునంటున్నారు.
కానీ, అనుష్కపై ఇలాంటి రూమర్స్ చాలా కామన్. ఇక అనుష్క పని అయిపోయినట్లే.. అన్న ప్రతి సారీ అనుష్క మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతూనే వుంటుంది. అసలే సీనియర్ హీరోలు ఫుల్ జోష్ మీదున్నారు. సీనియర్ హీరోల సరసన హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా వుంది టాలీవుడ్లో. సో ఈ రీజన్‌తో అనుష్క, ఇప్పుడు కూడా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







