కార్బెవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్..
- June 04, 2022
హైదరాబాద్: ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ‘Corbevax’ బూస్టర్ డోస్‌గా రానుంది. ఈ కార్బెవాక్స్ బూస్టర్ డోసుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. ప్రధానంగా 18ఏళ్లు దాటిన వారందరికీ టీకాను వేసేందుకు అనుమతినిచ్చింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కార్బెవాక్స్ టీకాను బూస్టర్ డోస్‌గా వేసుకోవచ్చునని తెలిపింది. కార్బెవాక్స్ హెటెరోలాజస్ బూస్టర్‌గా ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ కూడా ఇదే. కొవిడ్ రెండో డోస్ తీసుకున్న 6 నెలల తర్వాత బయోలాజికల్-ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ఈ టీకాను బూస్టర్ డోస్‌గా వేసేందుకు డీసీజీఐ ఆమోదం పొందడంపై కంపెనీ ఎండీ మహిమా దాట్ల ఆనందం వ్యక్తం చేశారు.
కార్బెవాక్స్ వ్యాక్సిన్ భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా బూస్టర్ డోస్‌ల అవసరాన్ని తగ్గించగల సామర్థం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము ముందడుగు పడిందని అన్నారు. బయోలాజికల్-ఈ ఒక్కో డోస్ టీకా ధర రూ.250కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని ట్యాక్సులతో కలిపి ఒక్కో బూస్టర్ డోసును వ్యాక్సిన్ కేంద్రాల్లో రూ.400కు అందించనుంది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో అయితే ట్యాక్సులు, అడ్మినిస్ట్రేషన్ చార్జీలతో కలిపి ఒక్కో డోసుకు రూ.990 వరకు ఖర్చు అవుతుంది.
2022 ఏప్రిల్‌లో డీసీజీఐ కార్బెవాక్స్ 5ఏళ్ల నుంచి 12ఏళ్లు, 6ఏళ్ల నుంచి 12ఏళ్ల పిల్లలకు టీకా వేసేందుకు అత్యవసర అనుమతిని పొందింది. క్లినికల్ ట్రయల్ డేటాలో Corbevax బూస్టర్ మోతాదు రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపర్చిందని, సురక్షితంగా ఉందని రుజువైంది. 18ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 416 సబ్జెక్టుల్లో కంపెనీ ఈ ట్రయల్‌ని నిర్వహించింది.
Corbevaxతో టీకాలు వేసేందుకు స్లాట్‌ను CoWIN పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు.. భారతదేశంలో 51.7 మిలియన్ డోస్‌ల కార్బెవాక్స్ పిల్లలకు అందించింది. వీరిలో 17.4 మిలియన్లు రెండు డోస్‌లను పొందారని బయోలాజికల్ ఇ లిమిటెడ్ తెలిపింది. ఏప్రిల్‌లో, 5 నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లలకు బయోలాజికల్ ఇ కోవిడ్-19 వ్యాక్సిన్ కార్బెవాక్స్ కోసం అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేయాలని DCGI సిఫార్సు చేసింది. కంపెనీ 100 మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌ను కేంద్రానికి సరఫరా చేసింది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







