నిర్దిష్ట వ్యవధిలో తిరిగి రాని ప్రవాసులపై 3 ఏళ్ల నిషేధం
- June 05, 2022
రియాద్: ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసాతో సౌదీ అరేబియాను విడిచిపెట్టి నిర్దిష్ట వ్యవధిలో తిరిగి రాని ప్రవాసుడు రాజ్యంలోకి ప్రవేశించకుండా 3 సంవత్సరాల పాటు నిషేధించబడతారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) తెలిపింది. వీసాలో పేర్కొన్న వ్యవధిలో ప్రవాసుడు తిరిగి రాకపోతే యజమాని తప్పనిసరిగా కొత్త వీసాను జారీ చేయాలని జవాజాత్ పేర్కొంది. వీసా గడువు తేదీ నుండి రెండు నెలల తర్వాత ఆటోమెటిక్ గా ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసా జారీ చేసిన ఏ ప్రవాసుడికైనా “వెళ్లి..తిరిగి రాలేదు” అని రికార్డు అవుతుందని తెలిపింది. ప్రవేశ నిషేధం కాలం వీసా గడువు ముగిసిన తేదీ నుండి లెక్కించబడుతుందని, హిజ్రీ క్యాలెండర్ ఆధారంగా ఉంటుందని జవాజాత్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







