స్మోకింగ్ మానేయడానికి సాయం చేసే క్లినిక్ లు ప్రారంభం

- June 05, 2022 , by Maagulf
స్మోకింగ్ మానేయడానికి సాయం చేసే క్లినిక్ లు ప్రారంభం

కువైట్: స్మోకింగ్ ను మానేయడానికి సహాయపడే 11 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ ప్రాంతాలలో ప్రారంభించింది. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ దీనా అల్-దుబైబ్ వీటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేంద్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విభాగం, జాతీయ కార్యక్రమం సహకారంతో క్లినిక్‌లు స్మోకింగ్ బాధితులకు సహాయాన్ని అందజేస్తాయన్నారు. అబ్దుల్లా అబ్దుల్‌హాది హెల్త్ సెంటర్స్, అలీ తునయన్ అల్-ఘనిమ్ మరియు క్యాపిటల్ హెల్త్ డిస్ట్రిక్ట్‌లోని అబ్దుల్ రెహమాన్ అబ్దుల్-ముఘ్నీ, ఫర్వానియా జిల్లాలోని అల్-రబియా హెల్త్ సెంటర్, రుమైథియా హెల్త్ సెంటర్ , హవల్లి జిల్లాలో హవల్లీ అల్-ఘర్బీ, జహ్రా జిల్లాలో అల్-ఓయోన్, అల్-అహ్మదీ హెల్త్ డిస్ట్రిక్ట్‌లోని అల్-ధహర్, తూర్పు అల్-అహ్మదీలలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ లు స్మోకింగ్ ను మానేయడంలో బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తాయని డాక్టర్ దీనా అల్-దుబైబ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com