జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసు : ఐదుగురు నిందితులు అరెస్ట్
- June 05, 2022
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్ కు వచ్చిన 17 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కార్ ఎక్కించుకొని , గ్యాంగ్ రేప్ చేయడం సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడిన వారంతా రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన వారే కావడం తో ఈ కేసు ఫై అంత ఫోకస్ చేసారు. ప్రభుత్వం నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు ఆరోపణలు చేయడం, పోలీసులు చూపని ఆధారాలు వారు బయటపెట్టడం తో మరింత ఇంట్రస్ట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన కు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసారు. శనివారం ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు.
నిందితులు ఎవరనేది చూస్తే..
A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు)
A2.. ఉమేర్‌ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు)
మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు
మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు
మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు.
ఇక ఈ కేసు ఫై గవర్నర్ తమిళ సై..స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







