ఖతార్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- June 05, 2022 , by Maagulf
ఖతార్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దోహా: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో 8 వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఇంట్రగ్రేట్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ కంజన్ హాల్ లో ఏర్పాట్లు చేసి, కరోన విపత్తు నుంచి కోలుకున్న తరువాత తెలంగాణా గల్ఫ్ సమితి సభ్యులు ఆనందంగా పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మొదట తెలంగాణ గల్ఫ్ సమితి ICBF అద్వర్యంలో గత 3 సమవత్సరాలుగా చేసిన సేవలు AV రూపంలో ఏర్పాటు చేసి సభ్యులకు తెలియజేయడం జరిగింది.. మరియు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు జానపద పాటలతో అంగరంగవైభవంగా ప్రదర్శనలు చేయడం జరిగింది.

తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ గత 3 సంవత్సరలుగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ముక్యంగా కరోన విపత్తు సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి మనో ధైర్యాన్ని నిలిపింది అని ఇంతటి విజయం వెనుక  ప్రతి ఒక్క సభ్యుడికి కృషి ఉందని పేర్కొన్నారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ICBF అధ్యక్షుడు వినోద్ నాయిర్ గారు, ICBF జనరల్ సెక్రెటరీ సబిత్ గారు, ICC  అద్వైజర్ చైర్మన్ కోడూరి ప్రసాద్ రావు గారు, ICC ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు,ICC జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్ గారు ,ICBF మెడికల్ క్యాంప్ ఇంచార్జి రజని మూర్తి గారు,KSQ అధ్యక్షుడు మహేష్ గౌడ్, TJQ అధ్యక్షులు నందిని అబ్బాగౌని గారు, AKV అధ్యక్షుడు వెంకప్ప, UKB అధ్యకుడు శశిధరన్,  పునరంజని అధ్యక్షులు దీపా,QPL అధ్యక్షుడు సిరాజ్ అన్సారీ TBF అధ్యక్షుడు మొహమ్మద్ లుత్ఫై గారు, TWA అధ్యక్షుడు ఖాజా నిజాముద్దీన్ మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com