పది నిమిషాల్లో మద్యం డెలివరీ..
- June 05, 2022
హైదరాబాద్: భారత్ లో ఇప్పటికే అనేక నగరాల్లో మద్యం డెలివరీకి అనుమతి ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. కోల్‌కతా నగరంలో కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి. అయితే, కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్‌కతా నగరంలో మద్యం డెలివరీ సేవలు ప్రారంభించింది. అది కూడా పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చెబుతోంది కంపెనీ.ఇప్పటికే అక్కడ మద్యం డెలివరీ సేవలు కొనసాగుతున్నాయి.
అయితే, పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ప్రకటించిన మొదటి సంస్థ మాత్రం ‘బూజీ’నే. ఈ సేవలకు గాను ‘బూజీ’కి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ అనుమతి కూడా లభించింది. ‘బూజీ’ సంస్థ స్థానికంగా ఉన్న వైన్ షాపుల నుంచి మద్యాన్ని సేకరించి, వినియోగదారులకు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ ద్వారా వినియోగదారుల ప్రవర్తనను ఈ యాప్ అంచనా వేస్తుందని యాప్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







