భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది: ఎంబసీ
- June 06, 2022
కువైట్ సిటీ: మన నాగరికత వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం యొక్క బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తోందని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అంతకు ముందు, ప్రవక్త మొహమ్మద్ (స)ను అవమానించిన వారిపై అధికారికంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంబసీలో ఫిర్యాదు చేసింది. అలాగే వారిపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కువైట్ స్వాగతించింది. అన్ని మతాల పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ.. ఇతరుల మతపరమైన వ్యక్తిత్వాన్ని అవమానించడం లేదా ఏదైనా మతం లేదా వర్గాన్ని కించపరచడం వంటి వాటిని ఖండిస్తూ సంబంధిత వర్గాలు ఒక ప్రకటనను కూడా విడుదల చేశాయని ఎంబసీ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







