భారత్ కరోనా అప్డేట్
- June 06, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. దేశంలో హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 25,782కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయి.
కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉంది. అలాగే, వారంతపు పాజిటివిటీ రేటు 0.91 శాతంగా ఉంది. కరోనాతో మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,701కు చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,26,30,852 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 194.12 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
కాగా, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ప్రజలందరూ మాస్కును తప్పనిసరిగా వాడాలని సూచించాయి. దేశంలోని పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతుండడం కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







