అల్లర్లు, బాంబు దాడులకు పాల్పడిన ముగ్గురికి జైలు శిక్ష

- June 06, 2022 , by Maagulf
అల్లర్లు, బాంబు దాడులకు పాల్పడిన ముగ్గురికి జైలు శిక్ష

మనామా: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. అలాగే వారికి జరీమానా కూడా విధించడం జరిగింది. అల్లర్లకు నిందితులు యత్నించారు. అలాగే, బాంబు దాడులకూ యత్నించారు. నిందితులకు ఏడాది నుంచి మూడేళ్ళ వరకు న్యాయస్థానం జైలు శిక్ష విధించగా, 100 బహ్రెయినీ దినార్ల నుంచి 500 బహ్రెయినీ దినార్ల వరకు జరీమానాలూ ఖరారయ్యాయి. ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పరచేందుకు గార్బేజ్ ట్రక్కుని నిందితులు తగలబెట్టారు. అలాగే, రోడ్ల మీద చెత్త వేసి తగలబెట్టారు. మాల్టోవ్ కాక్‌టెయిల్స్‌ని విసిరేసి పారిపోయేందుకు ఒకరరు ప్రయత్నించగా, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో మరికొందరు నిందితుల్ని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com