‘సూపర్’ ఛాన్స్ కొట్టేసిన అడవి శేష్ హీరోయిన్

- June 10, 2022 , by Maagulf
‘సూపర్’ ఛాన్స్ కొట్టేసిన అడవి శేష్ హీరోయిన్
అడవి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా ఈ మధ్యనే రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత గాధ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్.
 
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ ముద్దుల తనయ అన్న సంగి తెలిసిందే. తండ్రి నటనా వారసత్వాన్ని బాగానే పునికి పుచ్చుకుంది ఈ అందాల భామ. డాన్సుల్లో, యాక్టింగ్‌లో తనదైన స్టైల్ చూపిస్తోంది. మంచి పేరు తెచ్చుకుంటోంది.
 
డెబ్యూ సినిమా దెబ్బ కొట్టినా, రెండో సినిమా హిట్ ఇచ్చింది సయీ మంజ్రేకర్‌కి. దాంతో ముచ్చటగా మూడో ఛాన్స్ కూడా కొట్టేసిందట. ఈ సారి అలాంటిలాంటి ఛాన్స్ కాదు. ఏకంగా సూపర్ ఛాన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో సయీ మంజ్రేకర్ అవకాశం దక్కించుకున్నట్లు తాజా సమాచారం.
 
ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా పూజా హెగ్దే ఆల్రెడీ సెట్ అయిపోయింది. సెకండ్ హీరోయిన్‌గా సయీ మంజ్రేకర్‌కి మహేష్ బాబు ఛాన్సిచ్చాడట. ‘మేజర్’ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్‌తో మహేష్‌కీ మంచి పేరొచ్చింది. సో, ఆ సినిమా టైమ్‌లోనే మహేష్ బాబు సయీ మంజ్రేకర్‌కి మాటిచ్చాడట.
 
ఆ మాటను ఇలా నిలబెట్టుకోబోతున్నాడనేది ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ మనసులో వేరే హీరోయిన్ల లిస్టు వున్నప్పటికీ, మహేష్ రికమండేషన్ కదా.. కాదనడేమో. చూడాలి మరి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com