'రెడ్‌ సీ' మీదుగా సౌదీ, ఈజిప్ట్‌ మధ్య బ్రిడ్జ్‌

- April 09, 2016 , by Maagulf
'రెడ్‌ సీ' మీదుగా సౌదీ, ఈజిప్ట్‌ మధ్య బ్రిడ్జ్‌

రెడ్‌ సీ మీదుగా ఈజిప్ట్‌ - సౌదీ అరేబియా మధ్య బ్రిడ్జ్‌ నిర్మాణం కానుంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా వెల్లడించింది. కింగ్‌ సల్మాన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియా, ఐదు రోజుల ఈజిప్ట్‌ పర్యటనలో ఈ ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్యా నెలకొన్న చారిత్రక సంబంధాల్ని ఇంకా మెరుగుపరిచేందుకు ఈ బ్రిడ్జ్‌ తోడ్పాటునందిస్తుందని ఆయన చెప్పారు. ఈజిప్టియన్‌ స్ట్రాంగ్‌ మేన్‌ హోస్నీ ముబారక్‌ చొరవతో ఈ బ్రిడ్జ్‌ నిర్మాణానికి గతంలోనే ఆలోచనలు జరిగాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది సౌదీ పర్యాటకులు ఈజిప్ట్‌ని సందర్శిస్తుంటారు. అలాగే వేలాది మంది ఈజిప్టియన్లు సౌదీ అరేబియా సందర్శించడం జరుగుతుంది. ఈ కారణంగా ఇరు దేశాల మధ్యా సాంస్కకృతిక బంధం అలాగే వ్యాపార బంధం బలోపేతానికి తగు చర్యలు తీసుకుంటామని ఇరు దేశాల ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com