డ్రైవ్-త్రూ కొవిడ్-19 పరీక్షా కేంద్రాల పని వేళల్లో మార్పులు

- June 11, 2022 , by Maagulf
డ్రైవ్-త్రూ కొవిడ్-19 పరీక్షా కేంద్రాల పని వేళల్లో మార్పులు

మనామా: డ్రైవ్-త్రూ COVID-19 పరీక్షా కేంద్రాల పని వేళలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్‌డేట్ చేసింది.కింగ్ హమద్ యూనివర్శిటీ హాస్పిటల్ సమీపంలోని ముహర్రాక్‌లోని డ్రైవ్-త్రూ పరీక్ష కేంద్రం ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 04:00 నుండి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి. బహ్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ అండ్ ఎనర్జీ స్టడీస్ (డెరాసట్) సమీపంలోని సదరన్ గవర్నరేట్‌లోని అవలీలో డ్రైవ్-త్రూ టెస్టింగ్ సెంటర్ ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 04:00 నుండి రాత్రి 10:00 వరకు పనిచేయనుంది. ఉత్తర గవర్నరేట్‌లోని సల్మాన్ సిటీలో డ్రైవ్-త్రూ పరీక్ష కేంద్రం ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 04:00 నుండి రాత్రి 10:00 వరకు అందుబాటులో ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com