భారత్ కరోనా అప్డేట్
- June 11, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 3.44 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.41 శాతంగా ఉంది. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 4,216 మంది కోలుకున్నారు. ఇక ఈ వైరస్ కు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 40,370గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రజలకు 194.92 కోట్ల వ్యాక్సిన్ లను ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న 3,081 మంది కరోనా బారిన పడితే, అందులో ముంబైలోనే 1,956 కేసులు వచ్చాయి. కేరళలో 2,415 కేసులు, ఢిల్లీలో 655 కేసులు వచ్చాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?