పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ..
- June 11, 2022
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వ్యవస్థకు తలమానికంగా నిలిచేలా ప్రభుత్వం నిర్మిస్తున్న పోలీస్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది. నిర్మాణ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీకి సంబంధించి నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
అలాగే మెయిన్ కమాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ చోరీ ఇంటి దొంగల పనే అయ్యుంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనుమానిత వ్యక్తిని గుర్తించి, ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. జంటనగరాల్లో పూర్తి నిఘా పెట్టేలా, ఎక్కడ.. ఎలాంటి ఘటన జరిగినా వెంటనే స్పందించేలా, సరికొత్త టెక్నాలజీతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







