Qiwa పోర్టల్ లో కార్మికుల యొక్క అర్హత ను ఎలా తనిఖీ చేయాలి?

- June 11, 2022 , by Maagulf
Qiwa పోర్టల్ లో కార్మికుల యొక్క అర్హత ను ఎలా తనిఖీ చేయాలి?

 సౌదీ అరేబియా: విదేశీ కార్మికుల యొక్క నైపుణ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించడానికి సౌదీ అరేబియా మానవవనరుల మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ కిందటి ఏడాది వృత్తిపరమైన ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సదరు మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో నడుస్తున్న ఆన్ లైన్ వేదిక Qiwa లో ఉద్యోగుల యొక్క నైపుణ్య అర్హతలను ఎలా తనిఖీ చేయాలో పూర్తి సమాచారం నిక్షిప్తం చేయడం జరిగింది. 

ఆన్ లైన్ లో కార్మికుడి యొక్క అర్హతలను తనిఖీ చేయడం  

Qiwa పోర్టల్ లో కార్మికుడి అర్హతను తనిఖీ చేయడానికి, ఈ కింది విధంగా అనుసరించండి: 

ముందుగా Qiwa వెబ్సైట్ లోకి ప్రవేశించండి 
https://svp.qiwa.sa/en/test_taker/search

వెబ్సైట్ లోకి ప్రవేశించగానే మొదటి బాక్స్ మీద క్లిక్ చేయగానే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అవి 

  • ఇకామా నంబర్ 
  • అంతర్జాతీయ కార్మికులకు సంబంధించిన పాస్ పోర్ట్ నంబర్ 

 
వీటిలో ఒకటి ఎంచుకోండి

రెండో బాక్స్ లో మీరు ఎంచుకున్న ఆప్షన్ యెక్క నంబర్ ను నమోదు చేయండి. 

ఆతర్వాత కింద ఉన్న" నేను రోబోట్ కాదు" క్లిక్ చేయగానే ," చిత్రాలకు సంబంధించిన పట్టిక కనబడుతుంది" అక్కడ చిత్రాలు ఎంచుకుని, "ధృవీకరించు" మీద క్లిక్ చేయండి. 

అప్పుడు" చెక్" బటన్ పై క్లిక్ చేయండి. 

ఇప్పుడు మీరు కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడవచ్చు. 

ముగింపు: 

 కార్మికుల అర్హతలను చూసేందుకు Qiwa పోర్టల్ లో పైన పేర్కొన్న విధంగా అనుసరించండి, అప్పుడు మీకు పూర్తి సమాచారం తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com