తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

- June 11, 2022 , by Maagulf
తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

కువైట్ సిటీ: నందమూరి అందగాడు, హిందూపురం శాసనసభ్యుడు,బసవతారకం క్యాన్సర్  హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.కువైట్ సాల్మియా ఏరియాలో ఉన్న అవంతి ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు,తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.తెదేపా కువైట్ అధ్యక్షులు సుధాకర రావు మాట్లాడుతూ బాలకృష్ణ ఆయన తల్లి పేరుమీద వున్న క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా  క్యాన్సర్ బారిన పడిన ఎంతోమందికి ఉచిత వైద్య చేస్తూ ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారని  అన్నారు.ఆ భగవంతుడి ఆశీస్సులతో బాలకృష్ణ ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఇంకా ఎంతో మందిని కాపాడాలని కోరారు.తెదేపా కువైట్ పి.ఆర్.వో ఈశ్వర్ నాయుడు మాత్లాడుతూ కువైట్లో అందరికి బాలకృష్ణ మేనియా అని, బాలకృష్ణ డైలాగులు వింటుంతే రొమాలు నిక్కపొడుచుకుంటాయి, అంత పవర్ ఫుల్ డైలాగులు చెప్పే వ్యక్తి సినిమా ఇండస్టీలో లేరని అన్నారు.ఈడుపుగంటి దుర్గాప్రసాద్, దుగ్గి శ్రీను,చాన్ బాషా, బోయపాటి శ్రీను, సుబ్బా రెడ్డి, కొల్లి ఆంజనేయులు,పెంచల్ రెడ్డి, తుంగ రాఘవ, కోనంగి మల్లికార్జున, చిన్న రాజు, బల్లాపురం మల్లయ్య, మచూరి శివ, సంతోష్, వేణు, వంశీ కృష్ణ కాపెర్ల తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com