అజారుద్దీన్ కొడుకు అబ్బాస్ హీరోగా ఎంట్రీ ...
- April 09, 2016
ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీ కావటంతో ఈ రంగంలోని వారందరూ తమ వారసులను సినిమాల్లోనే నటించేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇతర రంగాల వారు కూడా సినీ రంగం మీద దృష్టి పెడుతున్నారు. రాజకీయ, వ్యాపార రంగాల నుంచి చాలా మంది సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అదే బాటలో ఓ స్టార్ క్రికెటర్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.ప్రముఖ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అబ్బాస్(అసదుద్దీన్) త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో 'నాకు ఓ లవ్వరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కె సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







