రామ్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా
- April 09, 2016
నేను శైలజ సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనలోనే ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చాడు. గతంలో రోటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రామ్, ఒకే తరహా పాత్రలు చేయటంతో ఆకట్టుకోలేకపోయాడు. మూస పాత్రలతో వరుస ఫ్లాప్ లు ఎదురకావటంతో కొత్త తరహా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.నేను శైలజ సినిమాతో తన ఒరిజినల్ ఎనర్జీకి భిన్నంగా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న రామ్ మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమా తరువాత మరోసారి ప్రయోగం చేయాలా..? లేక, మాస్ సినిమాకే ఓటేయ్యాలా..? తేల్చుకోలేక దాదాపు మూడు నెలలుగా కాలీగానే ఉంటున్నాడు. ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చిన రామ్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు.
రామ్ హీరోగా తెరకెక్కిన కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్, వెంటనే రామ్ హీరోగా మరో సినిమా చేయడానికి ప్రయత్నించాడు. అయితే అది వర్క్ అవుట్ కాకపోవటంతో ఎన్టీఆర్ హీరోగా రభస సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ కావటంతో ఇంతకాలం కాలీగా ఉన్న ఈ యువ దర్శకుడు ప్రస్తుతం పక్కా స్క్రీప్ట్ తో రామ్ ను మెప్పించాడు. ఉగాది సందర్భంగా ప్రారంభమైన రామ్, సంతోష్ శ్రీనివాస్ ల కొత్త సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







