ప్రబాస్ పెళ్లంట.! ఇంతకీ నిజమెంతంట.!

- June 11, 2022 , by Maagulf
ప్రబాస్ పెళ్లంట.! ఇంతకీ నిజమెంతంట.!

ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ పెళ్లికి వున్న క్రేజ్ మరే ఇతర ఇష్యూకి వుండదంటే అంతగా అతిశయోక్తి అనిపించదేమో. అందుకే ప్రబాస్ పెళ్లిని జాతీయ సమస్యగా కూడా అభివర్ణించేసుకున్నాం. ఎన్ని వర్ణణలూ, అభివర్ణణలూ వున్నా కానీ, జరగాల్సిన పని మాత్రం జరగనే జరగడం లేదు.

అదేనండీ. ప్రబాస్ పెళ్లి. ఇంచుకైనా ముందుకు కదలడం లేదు. కాదు, కాదండోయ్. ఈ సారి ఓ ఇంచు ముందుకు కదిలినట్లే వుంది. తాజాగా ప్రబాస్ పెళ్లి ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే రాజుగారి ఇంట పప్పన్నం కాదు కాదు, పంచ భక్ష్య పరమాన్నాలూ, నాటు కోడి, గీటు కోడి పులుసులూ, ఫ్రైలూ, చికెన్ బిర్యానీలు.. వాట్ నాట్ విందు భోజనం, పెళ్లి విందు భోజనం సిద్ధమవ్వనుందన్న మాట.

అవునండీ, ప్రబాస్ ఈ సారి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. అమెరికాకి చెందిన ఓ గ్రేట్ బిజినెస్ మ్యాన్ కుమార్తె‌తో ప్రబాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఈ సారి ప్రబాస్ నిజంగానే పెళ్లి బాజా షురూ చేయబోతున్నాడనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే కృష్ణం రాజు దంపతులు వెల్లడి చేయనున్నారట.

కాగా, ప్రబాస్ చేతిలో కుప్పలు తెప్పలుగా సినిమాలున్న సంగతి తెలిసిందే. అందులో ‘సలార్’ ప్రస్తుతం బిజీగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే, ‘ఆదిపురుష్’ సినిమా కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకుడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే, ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కూడా సెట్స్ మీదే వుంది. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవన్నీ 300 కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్ సినిమాలే. ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com