సర్ధార్ చిత్రం $ 606K కలెక్షన్లు సాధించి .శ్రీమంతుడు చిత్రం కి బ్రేక్ చేసింది..
- April 09, 2016
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంత భారీ విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. మహేష్ కెరియర్లోనే భారీ వసూళ్ళను సాధించిన చిత్రంగా శ్రీమంతుడు నిలచింది. ఇప్పుడు ఈ చిత్ర రికార్డ్‌ని బ్రేక్ చేసి సర్ధార్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఉగాది కానుకగా ఏప్రిల్ 8న సర్ధార్ చిత్రం విడుదల కాగా, అన్ని ఏరియాలలో కలెక్షన్లను కాన్స్టంట్గా రాబడుతుంది.సర్ధార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా, మొదటి రోజే ఈ చిత్రాన్ని చూడాలని అభిమానులు థీయేటర్ల వద్ద బారులు తీరారు. రిలీజ్‌కు ముందు రోజు రాత్రి 350 బెనిఫిట్ షోలను వేశారు. మనీ గురించి ఆలోచించకుండా రేటు ఎంతైనా సరే.. పవన్ సినిమా చూడాల్సిందే నంటూ థీయేటర్లకు పరుగులు తీసారు ఫ్యాన్స్. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతున్నట్టు సమాచారం. అమెరికాలో ప్రీమియర్ షోస్ ద్వారా సర్ధార్ చిత్రం $ 606K కలెక్షన్లు సాధించి, సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.శ్రీమంతుడు చిత్రం అమెరికాలో మొదటి రోజు ప్రీమియర్ షోస్ ద్వారా $ 560K కలెక్షన్లు సాధించింది. ఈ రికార్డ్‌ని సర్ధార్ బ్రేక్ చేసింది. రాజమౌళి తెరకెక్కిన బాహుబలి మాత్రం ప్రీమియర్ షోల ద్వారా $1395K కలెక్షన్లను రాబట్టి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది .
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







