ట్రేడర్స్ చేస్తున్న బంద్ వల్ల వారు శుక్రవారం ఒక్కరోజే రూ.2000 కోట్లు నష్టo...
- April 09, 2016
కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై ఒక్క శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బంగారు వర్తకులు, బులియన్ ట్రేడర్స్ చేస్తున్న బంద్ వల్ల వారు శుక్రవారం ఒక్కరోజే రూ.2000 కోట్లు నష్టపోయారు. గుడిపాడ్వ(ఉగాది) కావడం వల్ల సాధారణ రోజుల కంటే బంగార కొనుగోలుకు 15 శాతం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే బంగారం వర్తకులు గత మార్చి 2 నుంచి చేస్తున్న నిరవధిక బంద్ వల్ల ఈ సారి ఉత్తర భారత్ లో బంగార దుకాణాలన్నీ మూతపడ్డాయి.నాన్ సిల్వర్ జ్యువెలర్స్ పై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాము సుంకాన్ని చెల్లించేది లేదంటూ జ్యువెల్లరీ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమకు సమ్మతంగా లేదంటున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనేది కేవలం జ్యువెల్లర్లకు, ప్రభుత్వానికే కాకుండా, రాజకీయ సెగ కూడా తగిలింది. కాంగ్రెస్, శివసేన, ఆప్ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఉత్తర భారత్ లో బంగారం దుకాణాలన్నీ మూతపడ్డాయని ఢిల్లీ జ్యువెల్లర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ పొపాలియా తెలినారు. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో కూడా బంగారు షాపులు తెరవడం లేదన్నారు. గుడిపాడ్వ ఒక్కరోజే బంగార కొనుగోలు ఎక్కువగా ఉండవని, రెండు రోజుల పాటూ ఈ డిమాండ్ అధికంగా ఉంటుందని గీతాంజలి గ్రూప్ చైర్మన్ మెహుల్ చోక్సీ తెలిపారు. ఈ రెండు రోజుల్లో బంగారు వ్యాపారులు చాలా నష్టపోయామని వాపోయారు.ఎక్సైజ్ డ్యూటీ పెంచడమనేది చాలా సంక్లిష్టమైన ధోరణి అని, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తామన్న ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలన్నారు. అశోక్ లహరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేస్తానన్న కేంద్రం, ఇప్పటివరకూ దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఇలానే ఎక్కువ రోజులు బంద్ కొనసాగితే, గోల్డ్ బిజినెస్ ఎక్కువగా నష్టపోతుందని వీహెచ్‌పీ జ్యువెల్లర్ల డైరెక్టర్ ఆదిత్య చెప్పారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







