ప్రజా రవాణాలో దొంగతనాలు.. ప్రయాణికులకు పలు సూచనలు
- June 13, 2022
యూఏఈ: బస్సుల్లో జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ పోలీసులు కోరారు. నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రస్ అల్ ఖైమా పోలీస్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా అహ్మద్ బిన్ సల్మాన్ అల్ నుయిమి మాట్లాడుతూ.. దొంగలు సాధారణంగా ప్రజా రవాణాను ఉపయోగించుకుంటారని, పిక్పాకెటర్లు బాధితురాలితో ఇంటరాక్ట్ అవుతారని, దొంగతనం చేసేముందు బాధితులను మాటల్లో పెడతారని ఆయన తెలిపారు. ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నప్పుడు ప్రయాణికులకు ఆయన పలు సూచనలు చేశారు. సులభంగా తెరవగలిగే బ్యాగ్‌లను.. విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లవద్దు. రోజుకి అవసరమైనంత నగదు మాత్రమే తీసుకెళ్లాలి. తమ వాలెట్, నగదు లేదా మొబైల్ ఫోన్‌ను వెనుక జేబులో పెట్టుకోవద్దు. ఇతర ప్రయాణీకుల నుండి దూరంగా ఉండాలి. అపరిచితులతో మాట్లాడవద్దని ఆయన సూచించారు. ప్రయాణికులందరికీ భద్రత కల్పించేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారని సల్మాన్ అల్ నుయిమి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







