ఫిఫా ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు.. దోహా మెట్రో అదనపు సర్వీసులు

- June 13, 2022 , by Maagulf
ఫిఫా ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు.. దోహా మెట్రో అదనపు సర్వీసులు

దోహా: ఫిఫా వరల్డ్ కప్ ఇంటర్ కాంటినెంటల్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు జూన్ 13, 14 తేదీల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు హాజరయ్యే ఫుట్‌బాల్ అభిమానుల కోసం దోహా మెట్రో రెండు రోజులూ తెల్లవారుజామున 1 గంట వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఈవెంట్ కోసం మెట్రో సేవలు తెల్లవారుజామున 1 గంటల వరకు నడుపనున్నట్లు దోహా మెట్రో వెల్లడించింది. జూన్ 13న క్వాలిఫయర్స్ లో ఐదో స్థానంలో నిలిచిన పెరూతో ఆస్ట్రేలియా తలపనుండగా.. జూన్ 14న  కాన్కాకాఫ్ క్వాలిఫయర్స్ లో నాల్గవ స్థానంలో నిలిచిన కోస్టారికా.. ఓఎఫ్సీ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌తో ఆడనుంది. రెండు మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం 21:00 గంటలకు ప్రారంభమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com