ప్రజా రవాణాలో దొంగతనాలు.. ప్రయాణికులకు పలు సూచనలు

- June 13, 2022 , by Maagulf
ప్రజా రవాణాలో దొంగతనాలు.. ప్రయాణికులకు పలు సూచనలు

యూఏఈ: బస్సుల్లో జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ పోలీసులు కోరారు. నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రస్ అల్ ఖైమా పోలీస్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా అహ్మద్ బిన్ సల్మాన్ అల్ నుయిమి మాట్లాడుతూ.. దొంగలు సాధారణంగా ప్రజా రవాణాను ఉపయోగించుకుంటారని, పిక్‌పాకెటర్లు బాధితురాలితో ఇంటరాక్ట్ అవుతారని, దొంగతనం చేసేముందు బాధితులను మాటల్లో పెడతారని ఆయన తెలిపారు. ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నప్పుడు ప్రయాణికులకు ఆయన పలు సూచనలు చేశారు. సులభంగా తెరవగలిగే బ్యాగ్‌లను.. విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లవద్దు. రోజుకి అవసరమైనంత నగదు మాత్రమే తీసుకెళ్లాలి. తమ వాలెట్, నగదు లేదా మొబైల్ ఫోన్‌ను  వెనుక జేబులో పెట్టుకోవద్దు. ఇతర ప్రయాణీకుల నుండి దూరంగా ఉండాలి. అపరిచితులతో మాట్లాడవద్దని ఆయన సూచించారు. ప్రయాణికులందరికీ భద్రత కల్పించేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారని సల్మాన్ అల్ నుయిమి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com