జూన్ 15 నుంచి 3 నెలలపాటు ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో వర్క్ బ్యాన్

- June 13, 2022 , by Maagulf
జూన్ 15 నుంచి 3 నెలలపాటు ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో వర్క్ బ్యాన్

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, జూన్ 15 నుంచి ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో వర్క్ బ్యాన్ అమలు చేయనుంది. సెప్టెంబర్ 15 వరకు ఈ బ్యాన్ కొనసాగుతుంది. ఎండ తీవ్రత కారణంగా తలెత్తే ఇబ్బందుల నేపథ్యంలో తగిన ప్రోటోకాల్స్ పాటించేలా ఆయా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. గత కొన్నేళ్ళుగా ఈ బ్యాన్ ప్రతి యేటా అమలు చేస్తున్నారు. కార్మికుల భద్రత అత్యంత ప్రాధాన్యతాంశంగా ఈ బ్యాన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com