మురుగు నీటి గుంతలో పడి చిన్నారి మృతి
- June 14, 2022
మస్కట్: ఓ చిన్నారి మురుగు నీటి గుంతలో పడి మృతి చెందింది. ఈ ఘటనపై సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) చర్యలు చేపట్టింది. ఒక ఇంట్లో మురుగునీటి గొయ్యిలో చిన్నారి పడిపోయిన సమాచారం అందగానే నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్‌లోని రెస్క్యూ టీమ్‌లు సువైఖ్‌లోని విలాయత్‌లోని ఘటనా జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని సీడీఏఏ తెలిపింది. అనంతరం ఇంట్లోని మురుగునీటి గొయ్యిలో పడిపోయిన చిన్నారిని బృందాలు బయటకు తీశాయని.. కానీ అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు పేర్కొంది. చిన్నారుల భద్రతను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, ఇళ్లలో ప్రమాదకర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







