ఫిఫా ప్రపంచకప్.. 7 మిలియన్లకు పైగా ప్రయాణీకులు

- June 14, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచకప్.. 7 మిలియన్లకు పైగా ప్రయాణీకులు

దోహా: ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో నవంబర్-డిసెంబర్ 2022 నెలల్లో ఖతార్ విమానాశ్రయాలలో రాకపోకలు, నిష్క్రమణలు, రవాణాతో సహా ప్రయాణీకుల సంఖ్య 7 మిలియన్లకు పైగా ఉంటుందని ఎయిర్‌ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (క్యూసిఎఎ) అంచనా వేసింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే FIFA ప్రపంచ కప్ సందర్భంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA), దోహా అంతర్జాతీయ విమానాశ్రయం రెండింటిలోనూ ప్రయాణీకుల విమానాల సంఖ్య సుమారు 28 వేలకు చేరుకుంటుందని అంచనా. ప్రయాణీకుల ట్రాఫిక్ అంచనాలు 2021 సంవత్సరంతో పోలిస్తే +90% నుండి +105% వరకు వృద్ధి చెందిందని, సంవత్సరంలో మొత్తం ప్రయాణీకుల సంఖ్యను సుమారు 34 మిలియన్లకు దాటే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com