వివిధ భాషలలో ‘ప్రవక్త ఆఫ్ హ్యూమానిటీ’ ప్రచారం

- June 14, 2022 , by Maagulf
వివిధ భాషలలో ‘ప్రవక్త ఆఫ్ హ్యూమానిటీ’ ప్రచారం

అబుధాబి: ప్రవక్త ముహమ్మద్ (స) శాంతి, మానవాళి పట్ల ప్రేమ, సహన సందేశాన్ని ప్రచారం చేయాలని ముస్లిం మత పెద్దల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించనుంది. #Prophet_of_Humanity అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి వివిధ భాషల్లో ఈ ప్రచారం సాగనుంది. ప్రచారంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ (స) సూక్తులను, వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా చారిత్రాత్మక 'మదీనా ఒప్పందాల'లో మత స్వేచ్ఛ, మానవ సౌభ్రాతృత్వం కోసం ప్రవక్త చేసిన పిలుపులకు ఇది అనుగుణంగా ఉంటుందని అల్ అజార్ గ్రాండ్ ఇమామ్, ముస్లిం కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ ఛైర్మన్ డాక్టర్ అహ్మద్ అల్ తయెబ్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com