తెలంగాణ కరోనా అప్డేట్
- June 14, 2022
హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. 200మార్క్ దాటాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 219 కేసులు నమోదయ్యాయి. 76 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే 164 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, సంగారెడ్డి జిల్లాలో 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ జిల్లాల్లో రెండు చొప్పున, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పెద్ద ఎత్తున కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. కొవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రతిఒక్కరు ఎవరికివారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







