నితిన్‌కి 20 ఏళ్లు: అలా ఎలా అంటారా.!

- June 14, 2022 , by Maagulf
నితిన్‌కి 20 ఏళ్లు: అలా ఎలా అంటారా.!

‘జయం’ సినిమాతో ఇండస్ర్టీకి హీరోగా పరిచయం అయిన నితిన్, తొలి సినిమాతోనే యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇన్నోసెంట్ అప్పీల్‌తో కుర్రకారును తన వైపుకు తిప్పుకున్నాడు. యంగ్‌స్టర్స్‌కి క్రేజీ హీరోగా మారిపోయాడు.

 ఒక్కో సినిమాకీ ఒక్కోరకంగా తనను తాను మేకోవర్ చేసుకుంటూ వచ్చాడు. ‘దిల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. మొదటి నుంచీ ఒకే ప్యాటర్న్‌కి ఫిక్స్ అయిపోకుండా కెరీర్‌ని చాలా చూజీగా బిల్డప్ చేసుకుంటున్నాడు నితిన్.

అసలు విషయం ఏంటంటే, హీరోగా నితిన్‌కి 20 ఏళ్లు. అదేనండీ.. నితిన్ ఇండస్ర్టీకి పరిచయమై 20 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ రిలీజ్ చేశాడు నితిన్. తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఈ 20 ఏళ్లలో ఎంతో పరిణీతి చెందానని నితిన్ చెప్పుకొచ్చాడు.

‘భీష్మ’ సినిమా తర్వాత నితిన్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ప్రయోగాలు సక్సెస్‌నా.? ఫెయిల్యూర్‌నా.? అనే విషయం పక్కన పెడితే, కొత్త కొత్త కథలకు శ్రీకారం చుడుతున్నాడు. అలా వచ్చిన సినిమాలే ‘చెక్’ అయినా, ‘రంగ్ ‌దే’ అయినా.

తాజాగా ‘మాచర్ల నియోజక వర్గం’ అనే సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు త్వరలో నితిన్. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సీరియస్ టోన్‌లో నడవబోతోందని తెలుస్తోంది. నితిన్‌లోని మాస్ యాంగిల్‌ని కొత్తగా ప్రొజెక్ట్ చేయబోతోంది ఈ సినిమా.  ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కృతిశెట్టి, నితిన్‌కి జోడీగా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com