అమర్నాథ్యాత్రకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి
- April 09, 2016
పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటి వరకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. జూలై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై అమరనాథ్ ఆలయ బోర్డు సీఈఓ పీకే త్రిపాఠి మాట్లాడుతూ... ఇప్పటికే ముందస్తు రిజిస్ట్రేషన్లు లక్ష మార్కును దాటేశాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా మొత్తం 432 బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు.48 రోజుల పాటు మాత్రమే ఉండే ఈ యాత్ర జూలై 2న ప్రారంభమై ఆగస్టు 18 రక్షాబంధన్ రోజుతో ముగుస్తుందని చెప్పారు. రోజుకు 7,500 మంది భక్తులు చొప్పున మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తామని చెప్పారు. పహల్గామ్, బల్టల్ మార్గాల ద్వారా అమర్నాథ్ ఆలయం వద్దకు భక్తుల్ని పంపిస్తామని తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు సంబంధిత బ్యాంకు బ్రాంచీల వివరాల్ని తెలుసుకోవాలనుకుంటే తమ ఆలయ వెబ్సైట్ని సందర్శించాలని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!









