తొలి ప్రైవేటు రైలు ప్రారంభం
- June 15, 2022
కోయంబత్తూరు: భారత్‌లో తొలి ప్రైవేటు రైలు ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది. ‘దేఖో అప్నా దేశ్’ పేరుతో బయలుదేరిన ఈ రైలులో దాదాపు 1100 మంది ప్రయాణికులు ఉన్నారు. గురువారం ఉదయం ఏడున్నర గంటల వరకు రైలు సాయినగర్ షిరిడీకి చేరుకుంటుంది. తిరిగి శుక్రవారం ఉదయం బయలుదేరి, శనివారం మధ్యాహ్నం కోయంబత్తూరు చేరుకుంటుంది.
వెళ్లేటప్పుడు మార్గమధ్యలో మంత్రాలయం వద్ద రైలు ఐదు గంటలు ఆగుతుంది. ఈ సమయంలో భక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ రైలులో ప్రయాణించేందుకు ఐదు రోజుల టూర్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిరిడీ వెళ్లి, అక్కడ్నుంచి ఇదే రైలులో తిరిగి రావొచ్చు. రైలును ఆధునికంగా తీర్చిదిద్దారు. రైలులో డాక్టర్, రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది ఉంటారు. టూర్ ప్యాకేజీ కింద రైలులో శాకాహార భోజనం కూడా అందిస్తారు. భక్తులకు షిరిడీలో వీఐపీ దర్శనం, ఏసీ రూమ్స్, టూరిస్ట్ గైడ్స్, స్థానిక రవాణా వంటివి కూడా ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







