సైబర్ క్రైంకు పాల్పడితే Dhs 500,000 జరిమానా, జైలు శిక్ష

- June 15, 2022 , by Maagulf
సైబర్ క్రైంకు పాల్పడితే Dhs 500,000  జరిమానా, జైలు శిక్ష

యూఏఈ: అనుమతి లేకుండా ఇతరుల పాస్‌వర్డ్ లు, పాస్‌కోడ్‌లు, రహస్య నంబర్లు లేదా మరే ఇతర వివరాలను పొందడం శిక్షార్హమైన చర్య అని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను హెచ్చరించింది. నేరానికి పాల్పడే ఉద్దేశ్యంతో వెబ్‌సైట్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డేటా నెట్‌వర్క్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాధనాలను యాక్సెస్ చేయడం లేదా మరొక వ్యక్తికి యాక్సెస్ పొందడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లో పోస్ట్ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్షతోపాటు Dhs500,000 వరకు జరిమానా విధించే అవకావశం ఉందని పేర్కొంది. ఎలక్ట్రానిక్ నేరాలు, వదంతుల వ్యాప్తి 2021 ఆర్టికల్ నెం.34 ప్రకారం జైలుశిక్ష, జరిమానా విధించబడుతుందని తన పోస్ట్ లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com