రష్మిక అడిగేసింది. త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా.?

- June 15, 2022 , by Maagulf
రష్మిక అడిగేసింది. త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా.?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్లు సమ్‌థింగ్ డిఫరెంట్. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని అందాల భామలు కుతూహలపడుతుంటారు. ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కించనున్నారన్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో హీరోయిన్‌గా ఆల్రెడీ బుట్టబొమ్మ పూజా హెగ్దే సెట్ అయ్యింది. ఈ మధ్య త్రివిక్రమ్ తన సినిమాలకు డబుల్ గ్లామర్ అద్దుతూ, సక్సెస్ కొట్టడం అనే ఫార్ములాని ఫాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఓ హీరోయిన్‌ని స్టార్‌డమ్ వ్యూలో సెలెక్ట్ చేస్తాడు. ఇంకో హీరోయిన్‌ని ఓ మోస్తరు స్టార్ డమ్ వున్న హీరోయిన్‌ని సెలెక్ట్ చేస్తాడు.

కానీ, త్రివిక్రమ్ తాజా సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంగేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడెప్పుడో 'భీష్మ' సినిమా టైమ్‌లో కన్నడ కస్తూరి రష్మికా మండన్నా, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ప్రపోజల్ పెట్టింది. తన సినిమాలో ఛాన్సివ్వమని. అది మర్చిపోలేదు త్రివిక్రమ్. సో, ఆ ఛాన్స్ ఇప్పుడు మహేష్ సినిమాతో రష్మికకు ఇచ్చే ఆలోచనలో వున్నాడనీ ఇన్‌సైడ్ టాక్.  

అదే కనుక జరిగితే, మహేష్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతాయ్. అంతేకాదు, రష్మికను తీసుకుంటే, ఆ క్యారెక్టర్‌కి మరింత వెయిట్ అద్దాల్సిన అవసరం కూడా వుంటుంది. ఇప్పటికే అందుతోన్న సమాచారం ప్రకారం ఈ క్యారెక్టర్ చాలా స్పైసీగా హుందాగా వుండబోతోందనీ తెలుస్తోంది.

మరోవైపు రష్మిక మండన్నా ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, తమిళంలో తన డ్రీమ్ హీరో విజయ్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. హిందీలోనూ రష్మిక పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో సందడి చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com