హమ్మ వసుమతీ.! రీ ఎంట్రీ వెనుక అంత పెద్ద స్కెచ్ వుందా.?
- June 15, 2022
'వసుమతీ.. వసుమతీ..' అంటూ 'భరత్ అనే నేను' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబునే తన వెంట తిప్సేసుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి తెలుగు సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల భామ. ఫస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకీ సైన్ చేసేసింది.
అలా 'వినయ విధేయ రామ' సినిమాలో తన అంద చందాలతో మరోసారి ఆకట్టుకుంది. అయితే, సెకండ్ మూవీ రిజల్ట్ తేడా కొట్టేసరికి, మూడో సినిమా జోలికి పోలేదు కియారా అద్వానీ. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.
లాంగ్ గ్యాప్ తర్వాత ఫ్లాప్ ఇచ్చిన చరణ్ సినిమాతోనే మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది కియారా అద్వానీ. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15 వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి కియారా సైన్ చేయడానికి చాలా కారణాలున్నాయట. అందులో ఒకటి ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ కావడమేనట.
బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించడమనేది అంత ఆషా మాషీ ఇష్యూ కాదు. శంకర్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఎక్కువ వుంటుందన్న సంగతి తెలిసిందే. అదే కియారా ఈ సినిమాకి సైన్ చేయడానికి మరో కారణమట.
ఏది ఏమైతేనేం, మొత్తానికి కియారా మళ్లీ తెలుగులో కాలు మోపింది. అన్నీ కలిసొచ్చి, ఈ సినిమా హిట్ అయితే, మళ్లీ మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకోవడం పక్కా. ఇకపోతే, ఇటీవలే 'భూల్ భూలయ్యా 2' సినిమాతో బాలీవుడ్‌లో ఓ సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష