హజ్ కోసం 3 లక్షల దరఖాస్తులు: సౌదీ

- June 16, 2022 , by Maagulf
హజ్ కోసం 3 లక్షల దరఖాస్తులు: సౌదీ

జెడ్డా: హజ్ సీజన్ 2022 కోసం మొత్తం 297,444 దరఖాస్తులు వచ్చాయని సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మహిళలు ఉన్నారు. దేశంలోని పౌరులు, నివాసితుల కోసం ఎలక్ట్రానిక్ డ్రాలో మొత్తం 297,444 దరఖాస్తులు నమోదు చేయబడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  మొత్తం దరఖాస్తుదారులలో 31-40 సంవత్సరాల వయస్సు గలవారు అత్యధికంగా 38 శాతం ఉండగా.. 21-30 ఏజ్ గ్రూప్ వారు 23 శాతం, 41-50 వయసు వారు 21 శాతం, 51-65 మధ్య 12 శాతం ఉన్నారు. 20 ఏళ్లలోపు వారు అత్యల్పంగా ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేక షరతులను నిర్దేశిస్తుందని, ఆయా నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులనే ఆమోదించనున్నట్లు హజ్, ఉమ్రా డిప్యూటీ మంత్రి అబ్దుల్ఫట్టా మషాత్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఇమెయిల్ ([email protected]) లేదా ఏకీకృత నంబర్ 920002814, Twitter (@MOHU_Care) లో సంప్రదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com