3.5 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- June 17, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ వద్ద నిర్మాణ సామగ్రి రవాణాలో దాచి అక్రమంగా తరలిస్తున్న 3.5 మిలియన్లకు పైగా యాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ముగ్గురు టర్కీ అనుమానితులను అరెస్టు చేశామని, వీరిలో ఇద్దరు రాజ్యంలో నివాసం ఉంటున్నారని, మూడో వ్యక్తి సందర్శకుల వీసాపై దేశానికి వచ్చాడని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నుజైదీ తెలిపారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల, సౌదీ అధికారులు 403,000 కంటే ఎక్కువ మాత్రలను అక్రమంగా తరలించే కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







