ఏపీ సీఎం జగన్ ఫ్రాన్స్ పర్యటన ఖరారు…
- June 17, 2022
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్ పర్యటనకు వెళుతున్నారు. ఆయన పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి జులై 2న కాన్వోకేషన్ తీసుకోనున్నారు.కుమార్తె కాన్వోకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు.అనంతరం రాష్ట్రానికి తిరిగి వస్తారు. మరోవైపు పారిస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు.
దేశంవిడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు ఆదేశాలనుసడలించాలని… కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి వెళ్లి వస్తానని ఆయన కోరారు. ఇందుకోసం జూన్ 28 నుంచి వారం రోజులు పాటు పారిస్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







