భారత్ గోధుమలపై నిషేధం.. కువైట్కు మినహాయింపు
- June 17, 2022
కువైట్ సిటీ: రాబోయే కాలంలో కువైట్కు అవసరమైన అన్ని ఆహార ఉత్పత్తులను అందించడానికి భారతదేశం తన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసింది. గోధుమలతో సహా ఆహార ఉత్పత్తుల ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. కువైట్లో భారత రాయబారి సిబి జార్జ్.. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఫహద్ అల్-షరియాన్కు ఒక సమావేశంలో ఈ మేరకు హామీ ఇచ్చారు.కరోనా సమయంలో కువైట్ పోషించిన గొప్ప పాత్రను సిబి జార్జ్ గుర్తుచేసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారతదేశానికి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, వెయ్యికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కువైట్ సరఫరా చేసిన విషయం తెలిసిందే. కువైట్కు గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసే నిర్ణయంతో సహా, కువైట్కు అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు భారతదేశం సంసిద్ధత వ్యక్తం చేసిందని కువైట్ మంత్రికి భారత రాయబారి తెలిపినట్లు సమాచారం.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







