ఉత్తమ నూతన విమానాశ్రయంగా బహ్రెయిన్‌కి ప్రత్యేక గుర్తింపు
- June 17, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే అత్యుత్తమ నూతన విమానాశ్రయంగా అరుదైన గౌరవం దక్కింది. స్కైట్రాక్స్ 2022 ప్రపంచ విమానాశ్రయాల అవార్డుల్లో ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది బహ్రెయిన్ విమానాశ్రయం. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ప్యాసింజర్ టెర్మినల్ వద్ద జరిగిన అవార్డుల ప్రకటన కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు నిర్వాహకులు. గతంలో స్కైట్రాక్స్ రేటింగ్ ప్రకారం బహ్రెయిన్ ఫైవ్ స్టార్ గౌరవం పొందింది. ఈ గౌరవం దక్కించుకున్న మూడో మిడిల్ ఈస్ట్ విమానాశ్రయమిది. కోవిడ్ సేఫ్టీ ప్రికాషన్స్ విభాగంలోనూ ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. పెరల్ లాంజ్ సైతం ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. 8 నెలల పాటు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







