డ్రగ్స్ విక్రయం, ఫోన్లో అశ్లీల కంటెంట్.. 15 ఏళ్ల జైలు శిక్ష
- June 19, 2022
బహ్రెయిన్: హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఆసియా దేశానికి చెందిన ఒక యువకుడికి బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ అమ్మినందుకు BD 10,000 జరిమానాతోపాటు ఫోన్లో అశ్లీల కంటెంట్‌ను పెట్టుకున్నందుకు మరో BD100 జరిమానా విధించింది. రాజ్యంలో ఒక ఆసియా జాతీయుడు హెరాయిన్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు. అనుమానితుడిని గుర్తించడానికి పోలీసులు ఒక రహస్య ఏజెంట్ ద్వారా సమాచారం సేకరించుకొని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. సాధారణ దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు నిందితుడితో సంప్రదించి అతని నుండి BD60 విలువైన నిషేధిత డ్రగ్స్ ను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేశారని కోర్టు ఫైల్స్ ద్వారా తెలుస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







