తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మదర్ అండ్ చైల్డ్ టాలెంట్ షో’
- June 19, 2022
షార్జా: తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 18న మదర్ అండ్ చైల్డ్ టాలెంట్ షో ఘనంగా జరిగింది.మంతెన అమెరికన్ పాఠశాల, షార్జా ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా.. చిత్రలేఖనము, సంగీతం, నృత్య ప్రదర్శనలు, పలు ప్రతిభా ప్రదర్శనలు, స్నేహపూర్వక పోటీలు, బింగో తదితర ఈవెంట్లు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం తెలుగువారందరినీ ఎంతో అలరించింది. పర్వీన్, మహిళా బృందం ఇతర సభ్యులు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన వీణా ఉత్తంచందానీ(VSSS dubai అధ్యక్షురాలు) న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాకుండా..కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు తగు సలహాలు కూడా ఇచ్చారు.
దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం నిర్వహణలో అసోసియేషన్ మహిళా విభాగం సభ్యులు ఫ్లోరెన్స్ విమల, ఉషా దేవి ముఖ్యపాత్ర పోషించారు. అసోసియేషన్ కార్యనిర్వహక సభ్యులు లలిత, జయ తదితరులు తమ తోడ్పాటునందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అసోసియేషన్ సభ్యులకు కార్యక్రమ నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు.

తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







