విమానం రెక్కలకు మంటలు.. 185 ప్రయాణికుల ఎమర్జెన్సీ ల్యాండింగ్
- June 19, 2022
గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్‌జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ వెల్లడించింది.
“ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ప్రయాణిస్తున్నప్పుడే మంటలు అంటుకున్నట్లు తెలిసి.. వెంటనే ల్యాండ్ చేశాం. రెండు బ్లేడ్లు వంగిపోయాయి. పుల్వారీ షరీఫ్ మంటలను గమనించి ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు” అని పట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ అన్నారు.
అగ్ని ప్రమాదం వెనుక కారణం సాంకేతిక లోపమని భావిస్తున్న ఇంజినీరింగ్ బృందం.. పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నారు. పాట్నా నుంచి 12.30కి ఫ్లైట్ టేకాఫ్ అయినప్పటి నుంచి విమానంలో ఏదో ఆగిపోయినట్లు అనిపించిందని ప్రయాణికుల్లో ఒకరు తెలిపారు. టేకాఫ్ అయినప్పటి నుంచి ఏదో తప్పు జరిగినట్లుగా భావించినట్లు వెల్లడించారు.
ఎగిరేందుకు తీవ్రంగా సతమతమైన విమానం దాదాపు 25నిమిషాల పాటు గాల్లోనే ఉంది. ల్యాండింగ్ కాగానే, పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది విమానం సమీపంలోకి చేరుకుని ప్రయాణికులందరినీ క్షేమంగా దించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







